Skip to main content

Namaste NRI

విశాఖలో ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సు

విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో 31వ సీఐఐ భాగస్వామ్య 2026 సదస్సు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఆయనతో కలిసి సదస్సు ప్రాంగణానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా అతిథులకు సంప్రదాయ థింసా, తప్పెటగుళ్లు, గరగ నృత్యాలతో పాటు డప్పుల మోతతో కళాకారులు ఘన స్వాగతం పలికారు. కళాకారుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా డోలు వాయించి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం వివిధ కళా బృందాల వద్దకు వెళ్లి కళాకారులతో పాటు, ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులను అభినందించి వారితో కలిసి ఫొటోలు దిగారు.

సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్, ఎంఎస్ఎంఈ పెవిలియన్‌ను కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పండుతున్న పంటలు, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న విస్తృత అవకాశాలను డిజిటల్ స్క్రీన్ ద్వారా మంత్రి లోకేశ్ కేంద్రమంత్రికి క్షుణ్ణంగా వివరించారు. వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న ప్రగతి, గ్రోత్ స్టోరీలను సీఎం చంద్రబాబు కేంద్రమంత్రికి తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events