క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి ఓ సూపర్ హీరో చిత్రాన్ని రూపొందించబోతున్నారు. రోషన్ మేక కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అశోక క్రియేషన్స్ పతాకంపై అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో శ్రీకాంత్ క్లాప్‌నివ్వగా, ముప్పా వెంకయ్య చౌదరి కెమెరా స్విఛాన్ చేశారు.

ప్రపంచస్థాయి ప్రమాణాలతో అత్యాధునిక సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, వీఎఫ్ఎక్స్ వర్క్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుందని, డిసెంబర్ మొదటి వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటి రేఖా పాండే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: పీజీ విందా, సంగీతం: గౌరహరి, ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ సబ్బాని, మోనికా నిగోట్రే, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.















