బ్రిటన్‌లో ముంబైకి చెందిన బిలాల్ ఖాజీ ( 27 ఏళ్ల) అనే వ్యక్తికి 30 ఏళ్ల జైలుశిక్ష పడింది. సుమారు 70 మంది అమ్మాయిలను అతను వేధించాడు. అమ్మాయిలకు చెందిన శృంగారభరిత వీడియోలు, ఇమేజ్‌లు అతని వద్ద ఉన్నాయి. 10 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న గర్ల్స్ను బిలాల్ టార్గెట్ చేశారు. స్నాప్‌చాట్, వింక్, రాబ్లాక్స్ లాంటి సోషల్ మీడియా, గేమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లను అతను వాడాడు. 2021 నుంచి 2025 మధ్య కాలంలో అతను అమ్మాయిలను వేధించినట్లు తెలుస్తోంది. కనీసం 20 ఏళ్లు అతను జైలు జీవితాన్ని అనుభవించాలి. ఆ తర్వాత అతను పెరోల్‌కు అర్హుడు అవుతాడు. కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసేందుకు ఖాజీ బ్రిటన్ వెళ్లాడు. 37 అభియోగాలు నమోదు అయ్యాయి. చెస్టర్ క్రౌన్ కోర్టులో అతన్ని బంధించారు. అసభ్యకర చిత్రాలు పంపడం, బ్లాక్‌మెయిలింగ్ చేయడం, చిన్నారులను లైంగికంగా రెచ్చగొట్టినట్లు ఖాజీపై ఆరోపణలు ఉన్నాయి.

2021 డిసెంబర్లో ఓ బాధితురాలు డెర్బిషైర్ పోలీసుల్ని ఆశ్రయించడంతో ఖాళీ బాగోతం బయటపడింది. ఖాజీతో స్నాప్‌చాట్‌లో మాట్లాడేదాన్ని అని ఓ 13 ఏళ్ల అమ్మాయి ఫిర్యాదు చేసింది. అయితే నిందితుడు ఖాజీ తాను కూడా 14 ఏళ్ల వ్యక్తినే అని చెప్పుకుంటూ ఆ వయసున్న అమ్మాయిలను ట్రాప్ చేశాడు. పరిచయం కాగానే, సెక్సువల్ సంభాషణ చేయడం, ఆ తర్వాత అసంబద్ధమైన ప్రశ్నలు వేసి, అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసేవాడని తెలిసింది. అయితే తనకు షేరింగ్ చేసిన ఫోటోలు, వీడియోలను సర్క్యూలేట్ చేస్తానని బెదిరించేవాడని ఓ అమ్మాయి తన ఫిర్యాదులో చెప్పింది. ఖాజీ బాధితుల్లో 180 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని వద్ద ఉన్న డివైస్ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. బాధితుల్లో 11 నుంచి 17 ఏళ్ల వయసున్న అమ్మాయిలు సుమారు 70 మంది ఉంటారని అధికారులు చెప్పారు.















