Skip to main content

Namaste NRI

డెలివరీ హీరోలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..!

ఎండనకా, వాననకా నిరంతరం ఆర్డర్లు డెలివరీ చేస్తూ, క్యాబ్‌లు నడుపుతూ జీవనం సాగిస్తున్న లక్షలాది మంది గిగ్‌ వర్కర్ల జీవితాల్లో సరికొత్త భరోసా నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. గతంలో రాహుల్ గాంధీని కలిసి తమ దీనస్థితిని, చట్టపరమైన రక్షణ లేకపోవడాన్ని గిగ్‌ వర్కర్లు వివరించారు. అప్పుడే వారికి అండగా ఉంటామని రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకుంది. వివిధ రంగాలకు చెందిన నిపుణుల సలహాలు, కార్మికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ సరికొత్త చట్టాన్ని రూపొందించారు.

గిగ్‌ వర్కర్ల కుటుంబానికి ఎలాంటి ఆపదొచ్చినా ఆర్థిక భరోసా కల్పించేలా రూ. 5 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కల్పించనున్నారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఎలాంటి ఖర్చు లేకుండా రూ. 10 లక్షల ఉచిత మెరుగైన వైద్య సదుపాయం కల్పిస్తారు. డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్న వారికి ప్రత్యేకమైన చట్టపరమైన రక్షణ, గౌరవం లభిస్తుంది.

అంతకుముందు శిల్పకళా వేదిక నుంచి జయభేరీ గ్రౌండ్స్ వరకు గిగ్‌ వర్కర్లు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సభలో రాహుల్ గాంధీ గిగ్‌ వర్కర్లతో నేరుగా ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడే ప్రతి శ్రామికుడికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events