Skip to main content

Namaste NRI

కెరూబ్‌ సినిమా ట్రైలర్‌ విడుదల

విహాన్‌ కార్తీక్‌ హీరోగా ఎంజే నాయుడు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కెరూబ్‌. గత, వర్తమాన, భవిష్యత్తు అని ఉపశీర్షిక. ట్రైలర్‌ను విడుదల చేశారు. విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుందని, విజువల్స్‌ ఆకట్టుకునేలా ఉంటాయని దర్శకుడు తెలిపారు. గతంలో ఓ సినిమాలో విలన్‌ పాత్రలో నటించానని, హీరోగా తనకిది తొలిచిత్రమని, ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌తో తీశారని హీరో విహాన్‌ కార్తీక్‌ చెప్పారు. దివ్య విశ్వకర్మ, కల్పలత, సుమన్‌శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 20న విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: సత్యరాధాకృష్ణ, రచన-దర్శకత్వం: ఎంజే నాయుడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events