రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా మైసా. రవీంద్ర పుల్లె దర్శకత్వం. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ మరియు హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా తండ్రి కూతుళ్ల మధ్య ఉండే స్వచ్ఛమైన బంధాన్ని కళ్లకు కట్టేలా రెండో పాట ఏనాటి వరమో నువ్వును మేకర్స్ విడుదల చేశారు. చక్కని మధురమైన బాణీలు, హృదయాలను హత్తుకునే భావోద్వేగాలతో రూపొంది.

ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ ఈ పాటకు అత్యద్భుతమైన మెలోడీని అందించారు. వినసొంపైన ట్యూన్‌తో పాటు శ్రోతలను కంటతడి పెట్టించే ఎమోషన్స్‌ను ఆయన తన సంగీతంతో పలికించారు. గాయకుడు కృష్ణ తేజస్వి తన మధురమైన గాత్రంతో ఈ పాటకు మరింత జీవం పోశారు. ప్రతిభావంతులైన గీత రచయిత రెహమాన్ అందించిన సాహిత్య విలువలు పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఒక తండ్రికి తన కూతురిపై ఉండే నిస్వార్థమైన ప్రేమ, అపారమైన ఆప్యాయతను ఈ పాటలోని ప్రతీ పదం ఎంతో చక్కగా వివరించింది. మానవ సంబంధాలలో అత్యంత పవిత్రమైన తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ఈ గీతం అద్భుతంగా ఆవిష్కరించింది.

ఈ పాటలో నాయిక మైసా చిన్ననాటి రోజులను అందంగా కళ్లకు కట్టారు. చిన్నతనం నుంచే ఎంతో ధైర్యంగా, సాహసాలు చేయడానికి ఇష్టపడే అమ్మాయిగా మైసా పాత్రను దర్శకుడు తీర్చిదిద్దారు. వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండటం, చెట్లు ఎక్కడం వంటి చురుకైన సన్నివేశాలతో ఆమె వ్యక్తిత్వం హైలైట్ అవుతుంది. తండ్రిపై తనకు ఉన్న అమితమైన ప్రేమకు గుర్తుగా ఆయన రూపంలో టాటూ వేయించుకోవాలనుకోవడం ఈ పాటలోని అత్యంత భావోద్వేగ సన్నివేశంగా నిలుస్తుంది. రష్మిక చిన్ననాటి పాత్రలో నటిస్తున్న ఈ విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.















