Skip to main content

Namaste NRI

డొనాల్డ్ ట్రంప్ కు షాక్ .. విదేశీ విద్యార్థులకు భారీ ఊరట!

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులు, విదేశీ జర్నలిస్టుల నివాస గడువుకు పరిమితులు విధించాలని ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను అక్కడి ఫెడరల్‌ కోర్టు కొట్టివేసింది. విద్యార్థుల నివాస కాలపరిమితి నాలుగేళ్లకు పరిమితం చేయడంతోపాటు, ఆ తర్వాత కొనసాగాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేయాలన్న హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం (డిహెచ్‌ఎస్) ప్రతిపాదన చట్టవిరుద్ధమని తేల్చింది. దీంతో దశాబ్దాలుగా అమల్లో ఉన్న డ్యూరేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌ విధానం కొనసాగనుంది. ఈ తీర్పుతో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు సహా విదేశీ విద్యార్థులకు ఊరట లభించినట్లయింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events