Skip to main content

Namaste NRI

కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ షాకింగ్ నిజాలు!

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ ఎవరికీ అంతుచిక్కని ఒకే ఒక్క రహస్యం.. ‘కాస్టింగ్ కౌచ్’. దశాబ్దాలుగా ఇదొక బహిరంగ రహస్యంగానే మారుతూ వస్తోంది. అయితే దీనిపై సీనియర్ నటి రమ్యకృష్ణ చేసిన తాజా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేవలం సినీరంగంలోనే కాకుండా ప్రతి చోటా ఈ వేధింపులు ఉంటాయని, వాటిని ఎవరూ ఆపలేరని ఆమె కుండబద్దలు కొట్టేశారు.

అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లోనే ఎప్‌స్టీన్ ఫైల్స్ వంటి ఉదంతాలు బయటపడుతున్నప్పుడు, గ్లామర్ ప్రపంచంలో ఇది జరగదని చెప్పలేమని రమ్యకృష్ణ స్పష్టం చేశారు. ఇష్టం, బలవంతం లేదా పరిస్థితుల ప్రభావం.. ఏదైనా కావచ్చు కానీ, ఈ దోపిడీ మాత్రం అన్ని రంగాల్లోనూ లింగ భేదం లేకుండా నిరంతరం సాగుతూనే ఉంటుందని ఆమె తేల్చిచెప్పారు.

వెండితెర వెనుక నాటి తరం నటీమణులు పడ్డ నరకయాతనను ఆమె గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. నేడు లభించే లగ్జరీ కార్లు, అత్యాధునిక క్యారవాన్‌లు ఆ రోజుల్లో కేవలం కల మాత్రమేనన్నారు. ఒకప్పుడు షూటింగ్ స్పాట్లలో కనీసం మహిళలకు వాష్‌రూమ్ సౌకర్యం కూడా ఉండేది కాదని రమ్యకృష్ణ తెలిపారు. బట్టలు మార్చుకోవడానికి ప్రైవసీ లేక, ఎండలో ఆగి ఉన్న అంబాసిడర్ కార్లలో కూర్చుని ప్లాస్టిక్ బాటిళ్లలోనే మూత్ర విసర్జన చేసిన దుస్థితి తమదంటూ నాటి భయానక రోజులను తలచుకున్నారు. ఆనాటి కష్టాలతో పోలిస్తే నేటి తరం నటీనటులు ఎంతో అదృష్టవంతులని, తాము ఎదుర్కొన్న ఇబ్బందుల్లో కనీసం పావు వంతు కూడా వీరు అనుభవించడం లేదని అన్నారు. రమ్యకృష్ణ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events