
సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా రానున్న పాన్ ఇండియా వార్ డ్రామా మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్. చిత్రాంగద సింగ్ కథానాయిక. అపూర్వ లఖియా దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదల కానున్నది. తొమ్మిది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ 9కోట్ల వీక్షణలు దాటి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ట్రైలర్‌కి అపూర్వ స్పందన రావడంతో సల్మాన్‌ఖాన్, కథానాయిక చిత్రాంగద హైదరాబాద్ వచ్చి ఇక్కడి మీడియాతో తమ సక్సెస్‌ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని తమ పాత్రల గురించి, సినిమా కోసం తాము పడ్డ మానసిక శ్రమ గురించి సల్మాన్, చిత్రాంగద చెప్పుకొచ్చారు. షూటింగ్ సమయంలో తాము ఎదుర్కొన్న సవాళ్ల గురించి సుధీర్ఘంగా వారు మాట్లాడారు. సినిమా ప్రచార చిత్రాలకు వస్తున్న స్పందనపై వారు ఆనందం వెలిబుచ్చారు. 9కోట్ల వీక్షణలు దాటి దూసుకుపోతున్న ట్రైలర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. అలాగే హైదరాబాద్‌లో తనకున్న అనుబంధాన్ని కూడా సల్మాన్‌ఖాన్ గుర్తుచేసుకున్నారు.















