యశ్వంత్, ధనశ్రీవర్మ ప్రధానపాత్రల్లో నటించిన యువతరం ప్రేమకథ హే కన్నమ్మ. శశికుమార్ ముత్తులూరి దర్శకుడు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై హర్షిత్‌రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. హీరో యశ్వంత్ మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండే కథ ఇది. అన్ని వయసుల వారికీ ఈ కథ కనెక్ట్ అవుతుంది.ఈ సినిమా చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను. నాకీ అవకాశం ఇచ్చిన దిల్‌రాజుగారికి ధన్యవాదాలు అన్నారు.

అద్భుతమైన మ్యూజికల్ లవ్‌స్టోరీ ఇది. యశ్వంత్, ధనశ్రీ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఈ సినిమా చూసినప్పుడు మనసు బరువెక్కుతుంది. అలాగే తేలిక పడుతుంది. ఇది తన ప్రామిస్ అని దర్శకుడు శశికుమార్ ముత్తులూరి అన్నారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు. కార్తీక మురళీధరన్, వెంకటేశ్ కాకుమాను, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రాంపీ నందిగం, సంగీతం: కార్తీక్, నేపథ్య సంగీతం: జయకృష్ణ.















