Skip to main content

Namaste NRI

ఆ దేశంలో పర్యటించాలంటే తప్పసరిగా వ్యాక్సిన్

బ్రెజిల్‌లో పర్యటించాలంటే వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ను తప్పసరిగా చూపించాల్సిందే. వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా తమ దేశంలోకి ఎవరైనా రావచ్చని అధ్యక్షుడు బోల్సనారో ప్రకటించారు. అయితే వ్యాక్సినేషన్‌ తప్పనిసరి చేయాలన్న స్టేట్‌ హెల్త్‌ రెగ్యులేటర్‌ డిమాండ్‌ను అధ్యక్షుడు పెడచెవిన పెడుతూ వచ్చాయి. అయితే సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ లూయిస్‌ రొబెర్టో బార్రా సో తీవ్రంగా తప్పుబట్టారు. వ్యాక్సిన్‌ రహిత టూరిజమ్‌ను నిరోధించాల్సిందేనని అన్నారు. దేశానికి వచ్చే పర్యాటకులను  వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరి అడగాల్సిందేనని ఆ దేశ సుప్రీంకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.

Social Share Spread Message

Latest News