Skip to main content

Namaste NRI

పంచనామ ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేసిన వి.వి నాయక్

త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ లీడ్‌ రోల్స్‌లో సిగటాపు రమేష్‌ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పంచనామ.నటుడు వెంప కాశీ పుట్టిన రోజు సందర్భంగా హార్దిక్‌ క్రియేషన్‌ చిత్ర యూనిట్‌ మాస్‌ డైరెక్టర్‌ వి.వి వినాయక్‌ గారు చేతుల మీదుగా సినిమా ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ను విడుదల చేయడం జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వి.వి. నాయక్‌ మాట్లాడుతూ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ చూడగానే ఒక పాజిటివ్‌ వైబ్రేషన్‌ కలుగుతుంది. ఈ సినిమా ఎంత కసిగా చేశారో పోస్టరే చెబుతోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. డైరెక్టర్‌ సిగటాపు రమేష్‌ నాయుడు మాట్లాడుతూ నాకు ఇష్టమైన డైరెక్టర్స్‌లో వి.వి నాయక్‌ ఒకరు. ఆయన ఇచ్చిన దీవెనలు నాలో పాజిటివ్‌ ఎనర్జీ నింపాయి అని తెలిపారు. ఈ సినిమా  ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోంది అన్నారు. గద్దె శివకృష్ణ, వెలగ రాము నిర్మించారు.

Social Share Spread Message

Latest News