భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు బ్రిటన్ సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో భారత్‌కు మేలు చేకూర్చేలా కొన్ని చర్యలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెక్రెటరీ ఆన్ మేరీ ట్రేవెలిన్ ఈ నెల భారత్‌కు రానున్నారు. ఈ సందర్భంగా వాణిజ్య ఒప్పందం గురించి భారత్ అధికారులతో చర్చించనున్నారు. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, పర్యాటకులకు వీసా ఖర్చులు తగ్గించేలా వీసా నిబంధనల్లో మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే భారత్ కోరుతున్న వీసా నిబంధనల సరళీకరణకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది.














