Skip to main content

Namaste NRI

రష్యాలో మళ్లీ కరోనా విజృంభణ

రష్యాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. కొన్నాళ్లుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు, మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 19,751 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,05,19,733కు చేరింది. రష్యా రాజధాని మాస్కోలోనే భారీ నమోదయ్యాయి. అక్కడ 2,739 మందికి కరోనా వైరస్‌ సోకింది. 1,529 కేసులతో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌, 1,187 కేసులతో మాస్కో రీజియన్‌ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.  గడిచిన 24 గంటల్లో 847 మంది ప్రాణాలు కోల్పోయారు. 33,144 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.  ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నదని నిపుణులు చెబుతున్నారు.

Social Share Spread Message

Latest News