కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని మంత్రి శ్రీ హరీశ్ రావును, వైద్యాధికారులను సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్ లో విజయవంతంగా అమలవుతూ సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న బస్తీ దవాఖానాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరపాలికల్లో అవసరం మేరకు విస్తరించాలని, జీహెచ్ఎంసీ పరిధిలో కూడా బస్తీ దవాఖానాల సంఖ్యను మరింతగా పెంచాలని సీఎం ఆదేశించారు.