Skip to main content

Namaste NRI

యూఏఈ కొత్త నిబంధన … వారికి మాత్రమే అనుమతి

కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో తమ దేశానికి వచ్చే విదేశీయులకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) కొత్త నిబంధనలను విధించింది. టీకా రెండు డోస్‌లు తీసుకున్న వారు బూస్టర్‌ డోస్‌ తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన ఈ నెల 10 నుంచి అమలులోకి రానుంది. సాధారణంగా ఎక్కడైనా రెండు డోస్‌ల టీకాలనే ఇస్తున్నారు. విదేశాలకు వెళ్లే వారికి వీసా ఉంటేనే నెల రోజుల వ్యవధిలో రెండు డోస్‌ల టీకాలను ఇస్తున్నారు. ఇప్పుడు బూస్టర్‌ డోస్‌ అంశాన్ని యూఏఈ తెరమీదకు తేవడంతో యూఏఈ వెళ్లే వలస కార్మికులు అయోమయానికి గురవుతున్నారు. వీసా గడువు సమీపించే వారికి కేంద్రం బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలని కోరుతున్నారు. మన దేశంలో బూస్టర్‌ డోస్‌ కేవలం ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కే ఇవ్వాలని నిర్ణయించారు. ఇతరులకు బూస్టర్‌ డోస్‌ ఇచ్చే అంశం ఇంకా వైద్య ఆరోగ్య శాఖ పరిశీలనలో ఉంది.

Social Share Spread Message

Latest News