గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై మహారాష్ట్రలో ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. కాపీ రైట్ ఉల్లంఘనపై కోర్ట్ ఆదేశాల మేరకు ఎంఐడీసీ (మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) స్టేషన్‌లో పిచాయ్ తో పాటు మరో ఐదుగురిపై కూడా కేసులు నమోదయ్యాయి. డైరెక్టర్`ప్రొడ్యూసర్ సునీల్ దర్శన్ ఫిర్యాదు మేరకు కాపీరైట్ ఉల్లంఘన కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడిరచారు. 2017లో విడుదలైన తన ఏక్ హసీనా థీ ఎక్ దివానా థా సినిమాకు సంబంధించి ఎలాంటి హక్కులు ఇవ్వకపోయినా గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ ఈ సినిమాను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిందని దర్శన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇల్లీగల్ విషయంలో యూట్యూబ్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, అందుకే తాను ఈ చర్యకు దిగానని అంటున్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు తాజాగా పద్మ భూషణ్ పురస్కారం గౌరవం దక్కిన విషయం తెలిసిందే.














