Skip to main content

Namaste NRI

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కు షాక్

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌పై మహారాష్ట్రలో  ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. కాపీ రైట్‌ ఉల్లంఘనపై కోర్ట్‌ ఆదేశాల మేరకు ఎంఐడీసీ (మహారాష్ట్ర ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) స్టేషన్‌లో పిచాయ్‌ తో పాటు మరో ఐదుగురిపై కూడా కేసులు నమోదయ్యాయి. డైరెక్టర్‌`ప్రొడ్యూసర్‌ సునీల్‌ దర్శన్‌ ఫిర్యాదు మేరకు కాపీరైట్‌ ఉల్లంఘన కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడిరచారు. 2017లో విడుదలైన తన ఏక్‌ హసీనా థీ ఎక్‌ దివానా థా సినిమాకు సంబంధించి ఎలాంటి హక్కులు ఇవ్వకపోయినా గూగుల్‌ యాజమాన్యంలోని యూట్యూబ్‌ ఈ సినిమాను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిందని దర్శన్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇల్లీగల్‌ విషయంలో యూట్యూబ్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, అందుకే తాను ఈ చర్యకు దిగానని అంటున్నారు. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు తాజాగా పద్మ భూషణ్‌ పురస్కారం గౌరవం దక్కిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News