Skip to main content

Namaste NRI

టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న జాన్వీకపూర్ ?

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోంది. తాజాగా విజయ్‌దేవరకొండ చిత్రంలో జాన్వీకపూర్‌ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. విజయ్‌దేవరకొండ, పూరి జగన్నాథ్‌ కలిసి ఈ చిత్రాన్ని చేయబోతున్నట్లు తెలిసింది. లైగర్‌ షూటింగ్‌ సమయంలో దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో విజయ్‌ దేవరకొండ ఈ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ కథానాయికగా నటించనున్నట్లు చెబుతున్నారు. కథతో పాటు విజయ్‌ దేవరకొండకు పాన్‌ ఇండియన్‌ స్థాయిలో ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఆమె ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు తెలిసింది. ఇక కీలక పాత్రల కోసం బాలీవుడ్‌ క్రేజీ స్టార్స్‌ ని సంప్రదిస్తున్నారట. ఇందులోని కీలక పాత్ర కోసం బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ని కీలక విలన్‌ పాత్ర కోసం హీరో అజయ్‌ దేవ్గన్‌ ని పూరి సంప్రదించాలనే ఆలోచనలో వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

Social Share Spread Message

Latest News