మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఆచార్య రిలీజ్ డేట్‌ను ఫైనల్ చేసింది చిరు`కొరటాల టీం. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విటర్ ద్వారా షేర్ చేసింది. యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో సామాజిక కథాంశంతో వస్తున్న ఈ మూవీలో రాంచరణ్ కీ రోల్ పోషిస్తుండగా కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. కరోనా నిబంధనలు పూర్తిగా ఎత్తివేస్తేనే ఇప్పుడు ప్రకటించిన ప్రకారం ఈ సినిమా వస్తుంది. లేదంటే మళ్లీ తేదీలు మారే అవకాశం ఉంది.














