Namaste NRI

మాజీ మిస్ అమెరికా చెస్లీ క్రిస్ట్‌ ఇక లేరు

రంగుల ప్రపంచంలో మరో ధృవతార నేలరాలింది. మిస్‌ యూఎస్‌ఏ 2019 చెస్లీ  క్రిస్ట్‌ (30)అనుమానాస్పద రీతిలో మరణించారు. న్యూయార్క్‌ సిటీలో 60 అంతస్తుల భవనం నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. అయితే చెస్లీ క్రిస్ట్‌ తొమ్మిదో అంతస్తులో నివసిస్తారని అధికారులు తెలిపారు. ఆమె  ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. చెస్లీ క్రిస్ట్‌ 1991లో మిషిగాన్‌ జాక్సన్‌లో జన్మించారు. సౌత్‌  కరోలినాలో పెరిగారు. వేక్‌  ఫారెస్ట్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చేసింది. లా డిగ్రీ కూడా పూర్తి చేసింది. విద్యాబ్యాసం అనంతరం లాయర్‌గా పని చేశారు. 2019 మిస్‌ యూఎస్‌ఏ టైటిల్‌ గెలుచుకున్నారు. చెస్లీ క్రిస్ట్‌ హఠాన్మరణం ఫ్యాషన్‌ ప్రపంచంలో విషాదం నింపింది. చెస్లీ ఆత్మహత్య ఘటనతో తన హృదయం ముక్కలైందని మిస్‌ యూనివర్స్‌ 2021 హర్నాజ్‌ సంధు అన్నారు. చెస్లీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఆమెతో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events