Skip to main content

Namaste NRI

అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి!

అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి దక్కింది. శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఫిన్‌టెక్‌ సంస్థ బోల్ట్‌కు సీఈవోగా భారతీయ అమెరికన్‌ మజూ కురవిల్ల ఎంపికయ్యారు. మంగళూరు యూనివర్సిటీలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చేసిన మజూ అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ నుంచి ఎంబీ పూర్తి చేశారు. 2021లో మజూ బోల్ట్‌లో చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా చేశారు. ఆ తరువాత సంస్థ  సీఓఓగా ప్రమోషన్‌ పొందారు. తాజాగా సీఈవో పదవి ఆయనను వరించింది. ప్రపంచస్థాయి నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను ఒక టీంగా ఏర్పాటు చేయడంలో మజూ నిష్టాతుడని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ రయాన్‌ బ్రెస్లో వ్యాఖ్యానించారు. సంస్థను గ్లోబల్‌ స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తారంటూ మజూను బ్రెస్లో ప్రశంసల్లో ముంచెత్తారు.

Social Share Spread Message

Latest News