Namaste NRI

రామారావు అన్ డ్యూటీ రాక ఖాయం

రవితేజ కథానాయకుడిగా రూపొందిస్తున్న చిత్రం రామారావు ఆన్‌డ్యూటీ. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ కథానాయికలు. ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో  కనిపించనున్నారు. దర్శకుడు శరత్‌ మండవ మాట్లాడుతూ రామారావు ప్రభుత్వ ఉద్యోగి. వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాన్ని ఏమాత్రం సహించడు. అణువణువునా తిరుగుబాటు తత్వాన్ని అలవర్చుకున్న అతని జీవిత గమనంలో ఎదురైన సంఘటనలేమిటి? విధి నిర్వహణలో రామారావు కనబరచిన తెగువ ఏమిటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని మార్చి 25 లేదా ఏప్రిల్‌ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్మన్‌, సంగీతం : సామ్‌ సీఎస్‌, నిర్మాణ సంస్థ : ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, ఆర్‌టీ టీం వర్క్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events