Namaste NRI

చరిత్ర సృష్టించిన తానా…రికార్డు స్థాయిలో

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేసింది. ఎందుకంటే విదేశాలలో ఉండే తెలుగు ఎన్నారైలకు తానా సుపరిచితం. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలలో తానా అతి పెద్ద సంఘంగా గుర్తింపు ఉంది.  అమెరికాలో తెలుగు వారి సంక్షేమం, తెలుగు భాష, సంస్కృతీ, సాంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా సేవలు అందిస్తున్న తానా తాజా సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. మే నెల నుంచి చేపట్టిన సభ్యత్వ నమోదు ఈ జనవరి 31న ముగిసింది. దీంతో మొత్తం 18,800 మంది సభ్యులుగా చేరారు. ఒక్క జనవరి నెలలోనే  17,500 మంది సభ్యతం పొందారు. సభ్యత్వం కోసం ఒక్కొక్కరు 125 డాలర్ల చొప్పున చెల్లించారు. 1977లో తానా ఆవిర్భావం తర్వాత ఇదే భారీ సభ్యత్వ నమోదుగా చెబుతున్నారు. తానా ప్రారంభం నుంచి 2021 మే వరకు సుమారు 18 వేల మంది సభ్యులు ఉండగా గత ఎనిమిది నెలల్లో మరో 18,800 మంది సభ్యులుగా నమోదయ్యారు  సభ్యత్వ రుసుము ద్వారా మొత్తం రూ.17,62 కోట్ల మేర లభించింది.

                        తానా ఫౌండేషన్‌ డోనర్లుగానూ రికార్డు స్థాయిలోనే నమోదు చేసుకున్నారు. మే ముందు వరకు 65 మంది ఫౌండేషన్‌ సభ్యులు ఉండగా తాజాగా మరో 100 మంది వరకు చేరినట్లు చెబుతున్నారు. వీరు ఒక్కొక్కరు 10 వేల డాలర్ల చొప్పున చెల్లించాలి. మొత్తగా భారత కరెన్సీలో రూ.7.50 కోట్ల వరకు చెల్లించారు. ఈ మొత్తాన్ని భారత్‌లో కార్యక్రమాల అమలుకు వెచ్చించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events