Skip to main content

Namaste NRI

మరోసారి నిబంధనలను పొడిగించిన ఒమన్

విదేశీ ప్రయాణికుల విషయంలో గల్ఫ్‌ దేశం ఒమన్‌ మరోసారి మార్గదర్శకాలను పొడిగించింది. 2021 జనవరి 26వ  తేదీన తీసుకువచ్చిన ఎంట్రీ మార్గదర్శకాలు యధావిధిగా కొనసాగుతాయని సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ (సీఏఏ) వెల్లడిరచింది. ఇక పాత మార్గదర్శకాల ప్రకారం విదేశీయులు ఒమన్‌లోకి ప్రవేశించాలంటే రెండు డోసుల వ్యాక్సినేషన్‌ తప్పనిసరి. ఇది 18 ఏళ్లకు పైబడిన ప్రవాసులు, విదేశీయులకు వర్తిస్తుంది. ఒమన్‌ చేరడానికి 72 గంటల ముందు తీసుకున్న పీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికేట్‌ కావాలి. ప్రయాణికులు జర్నీకి 72 గంటల ముందు ఆన్‌ అరైవల్‌ కరోనా టెస్టుకు అంగీకరిస్తారో వారు నెగెటివ్‌ సర్టిఫికేట్‌ చూపించాల్సిన అవసరం లేదు అని తెలిపింది.

Social Share Spread Message

Latest News