Skip to main content

Namaste NRI

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ సంచలన ఆరోపణలు

ఉక్రెయిన్‌పై దండయాత్రకు పాల్పడుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై అమెరికా సహా పలు దేశాలు భగ్గుమంటున్నాయి. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సంచలన ఆరోపణలు చేశారు. పుతిన్‌ను యుద్ధ నేరస్తుడిగా జాన్సన్‌ అభివర్ణించారు. పౌర స్థావరాలపై రష్యా బాంబులు కురిపిస్తున్న క్రమంలో పుతిన్‌పై ఆయన మండిపడ్డారు. ఉక్రెయిన్‌పై దాడిని ఆపాలని చర్చలు పునరుద్ధరించాలని పాశ్చాత్యదేశాలు డిమాండ్‌ చేస్తుండగా రష్యా యుద్దాన్ని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా పలు ప్రధాన నగరాల్లో రష్యన్‌ సేవలు కాల్పులతో విరుచుకుపడుతున్నాయి.

Social Share Spread Message

Latest News