Skip to main content

Namaste NRI

అమెరికాకు రష్యా షాక్‌.. ఇకపై  రాకెట్‌ ఇంజిన్లు

అగ్రరాజ్యం అమెరికాపై రష్యా ప్రతి చర్యలకు దిగింది. ఉక్రెయిన్‌పై దాడి విషయంలో తమ దేశంపై ఆంక్షలు విధిస్తున్న అమెరికాకు తాము సరఫరా చేస్తున్న రాకెట్‌ ఇంజిన్లను ఇకపై సరఫరా చేయబోమని స్పష్టం చేసింది. రష్యా స్పేస్‌ ఏజెన్సీ రొస్కామోన్‌ అధిపతి డిమిట్రీ రొగోజిన్‌ మీడియాతో మాట్లాడుతూ అమెరికా తమ దేశంపై కఠిన ఆంక్షలు విధిస్తున్న పరిస్థితుల్లో తాము ఆ దేశానికి రాకెట్‌ ఇంజిన్లు సరఫరా చేయలేమన్నారు. అమెరికా తమకు కావాల్సిన వాటిని ఉపయోగించుకుని, రాకెట్లు ప్రయోగించుకోవచ్చని అన్నారు. ఇప్పటికే సరఫరా చేసిన ఇంజిన్లకు సర్వీసింగ్‌ కూడా నిలిపివేస్తామన్నారు. 1990 నుంచి రష్యా అమెరికాకు 180 అధునాతన రాకెట్‌ ఇంజిన్లను సరఫరా చేసింది. వాటిలో 98 ఇంజిన్లను అట్లాస్‌ లాంఛ్‌ వెహికల్స్‌కు వాడారు. 

Social Share Spread Message

Latest News