Skip to main content

Namaste NRI

క్రిష్‌ చేతుల మీదుగా రణస్థలి ఫస్ట్‌లుక్‌ విడుదల

ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజే ప్రొడక్షన్‌ పతాకంపై సురెడ్డి సమరపణలో ధర్మ, ప్రశాంత్‌, శివ జామి, నాగేంద్ర, విజయ్‌రాగం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రణస్థలి. ఈ చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో  ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను దర్శకుడు జాగర్లమూడి క్రిష్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రణస్థలి టీజర్‌ బాగుంది. చిన్న సినిమాల్లో ఇలాంటి ఫైట్‌ సీక్వెన్స్‌ చేయడం మామలూ విషయం కాదు. డైలాగ్స్‌ వింటుంటే కేజీఎఫ్‌ లెవెల్‌లో ఇంపాక్ట్‌ ఇస్తున్నాయి. ఈ సినిమా విజయం సాధించాలి అన్నారు. మా మూవీలో క్యారెక్టర్స్‌ తప్ప ఆర్టిస్టులు కనిపించరు. నటీనటులు కొత్తవారైనా బాగా నటించారు. ప్రస్తుతం మా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల చేస్తాం అన్నారు పరుశురామ్‌ శ్రీనివాస్‌. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన మా చిత్రం హిట్‌ అవుతుంది అన్నారు సురెడ్డి విష్ణు. పరశురాం శ్రీనివాస్‌ దర్శకత్వంలో సురెడ్డి విష్ణు నిర్మించారు. కెమెరామెన్‌ : జాష్టి బాలాజీ, ఎడిటర్‌: భువన్‌.

Social Share Spread Message

Latest News