కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సమ్మతమే. మ్యూజికల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జోడీ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. మంచి అనుభూతిని పెంచే చిత్రంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని సినీ వర్గాలు తెలిపాయి. కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం జూన్ 24న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లవ్లీ అండ్ క్యూట్‌గా వుంది. హీరోయిన్ చాందిని గార్డెన్లో బట్టలు ఆరవేస్తూ కనిపిస్తుండగా, కిరణ్ ఆమెను ప్రేమగా కౌగిలించుకున్న మూమెంట్ బ్యూటీపుల్‌గా వుంది. హ్యాపీ స్మైల్స్‌తో వారిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది. విడుదల చేసిన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: సతీష్ రెడ్డి మాసం.














