నరేశ్ అగస్త్య హీరోగా వీరభద్రం చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది.ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ వీరభద్రం చౌదరిగారితో మేం నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. అద్భుతమైన కథతో ఆయన ఈ సినిమా తెరకెక్కించనున్నారు. క్రైమ్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా ఉంటుంది. ఆద్యంతం నవ్వించే అద్భుతమైన కథ కుదిరింది. దర్శకుడు వీరభద్రం, సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ కాంబినేషన్‌లో పూల రంగడు వంటి హిట్ సినిమా ఉంది. ఆ సినిమాలానే ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రం కూడా మంచి మ్యూజికల్ హిట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. మిగతా నటినటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం అన్నారు. ఈ చిత్రాని ఎంసీ అనిల్ రెడ్డి సమర్పణలో నబీషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మించనున్నారు. సహ నిర్మాత : జామి శ్రీనివాసరావు. నిర్మాణ సంస్థలు : జయదుర్గాదేవి మల్లీమీడియా, డెక్కన్ డ్రీమ్ వర్క్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రం చౌదరి.














