Namaste NRI

చోర్‌  బజార్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన బాలయ్య

ఆకాష్‌ పూరి హీరోగా జీవన్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం చోర్‌ బజార్‌. వి.ఎస్‌. రాజు నిర్మాత. గెహన సిప్పీ కథానాయిక. లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను  హీరో బాలకృష్ణ విడుదల చేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ  చిత్ర టైటిల్‌, ట్రైలర్‌ చాలా బాగున్నాయి. ప్రస్తుతం కొత్తగా, విభిన్నంగా ఉండే చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇది అలాంటి కొత్త తరహా చిత్రమవుతుందని ఆశిస్తున్నా అన్నారు. ఆకాష్‌ పూరి ఈ సినిమాతో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. యూనిట్‌కు శుభాకాంక్షలు అని తెలిపారు. ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి, ఇందులో ప్రేమకథతో పాటు ఓ వజ్రం మిస్సింగ్‌ చుట్టూ తిరిగే ఓ థ్రిల్లింగ్‌ కథ ఉన్నట్లు అర్థమవుతోంది. బచ్చన్‌ సాబ్‌ అనే మాస్‌ పాత్రలో ఆకాష్‌ కనిపించనున్నారు.  20 నిమిషాల్లో 30 టైర్స్‌ విప్పేస్తా. నా దిల్‌ కా దఢకన్‌ కోసం గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ కొట్టాలి అంటూ ట్రైలర్‌లో ఆకాష్‌ చెప్పిన డైలాగ్‌ ఆసక్తిరేకెత్తిస్తోంది.  ఇవి ప్రొడక్షన్స్‌ పతాకంపై విఎస్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. సంగీతం : సురేష్‌ బొబ్బిలి. ఛాయాగ్రహణం: జగదీష్‌ చీకటి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events