Skip to main content

Namaste NRI

ప్రపంచ రికార్డు సృష్టించిన జర్మన్‌ సర్ఫర్‌

జర్మన్‌ సర్ఫర్‌ సెబాస్టియన్‌ స్టెడ్‌నర్‌ 26.21 మీ (86 అడుగులు) అలపై సర్ఫింగ్‌  చేశాడు. సముద్రంలో భారీ అలతో పోటీపడుతూ సర్ఫింగ్‌ చేసి చరిత్ర సృస్టించాడు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులోకి ఎక్కడా. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ఇటీవల ఈ వీడియోను షేర్‌ చేయగా, ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. 37 ఏళ్ల సెబాస్టియన్‌ స్టెడ్‌నర్‌ అక్టోబర్‌ 2020లో పోర్చుగల్‌లోని నాజారేలోగల ప్రియా డో నోర్టే తీరంలో భారీ అలపై సర్ఫ్‌ చేశాడు. ఈ రైడ్‌ 2021 రెడ్‌ బుల్‌ బిగ్‌ వేవ్‌ అవార్డుల్లోని బిగ్గెస్ట్‌ టో అవార్డును కూడా గెలుచుకుంది. కాగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ చేసిన వీడియోను నాలుగు లక్షల మంది వీక్షించారు. 22 వేల లైక్స్‌ వచ్చాయి.

Social Share Spread Message

Latest News