Namaste NRI

మేం ముందే హెచ్చరించాం…ఆయన వినలేదు : జో బైడెన్‌

రష్యా చేస్తోన్న దురాక్రమణ ఉక్రెయిన్‌కు తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలను తెచ్చిపెడుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర గురించి తమ నిఘా సంస్థలు ముందుగానే సమాచారం సేకరించాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ఆయన లాస్‌ఏంజెల్‌లో డెమొక్రటిక్‌ పార్టీ ఆధ్వర్యంలో నిధుల సేకరణ కార్యక్రమంలో మాట్లాడారు. యుద్ధానికి రష్యా సిద్ధమవుతోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని అప్రమత్తం చేశానని, అయినప్పటికీ ఆయన పెడచెవిన పెట్టారని అన్నారు. రష్యా దాడి గురించి  మాకున్న సమాచారం ఆధారంగా మేం వెల్లడిరచాం. ఆయన (పుతిన్‌కు ఉద్దేశించి) సరిహద్దులోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. అందులో ఎలాంటి సందేహం లేదన్నారు.  రష్యా ప్రారంభించబోయే యుద్దం గురించి వినడానికి జెలెన్‌స్కీ ఇష్టపడలేదని తెలిపారు. ఇంకా చాలా మంది వినలేదు. వారు ఎందుకు వినకూడదనుకుంటున్నారో నాకు అర్థమైంది. కానీ ఆయన అప్పటికే వెళ్లిపోయారు అని అన్నారు. ఉక్రెయిన్‌ రష్యా యుద్దం గురించి స్పందిస్తూ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి పరిణామం జరగలేదన్నారు. ఇది  అతిశయోక్తి కాదు, ముమ్మాటికీ వాస్తవమేనని స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events