తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం అని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ ప్రయతిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డల మద్దతు ఉంటుందన్నారు. నాలుగేండ్ల క్రితమే ఆస్ట్రేలియాలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలతో భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం అనితరసాధ్యమైన అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. కులాలు, మతాల పేరుతో విభజించాలని చూస్తోన్న దేశంలో కేసీఆర్ జాతీయ పార్టీ అనివార్యమైందని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ను దేశ ప్రజలు ఆదరిస్తారని తెలిపారు.














