Skip to main content

Namaste NRI

ప్రపంచ శాంతి పరిరక్షణకు మా వంతు ప్రయత్నం

ప్రపంచ శాంతి పరిరక్షణకు మా వంతు ప్రయత్నం చేస్తున్నామని చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ తెలిపారు.  ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి తాను సిద్ధమని ప్రకటించారు. రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌తో ఫోన్‌ సంభాషణలో ఆ మేరకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. సంబంధిత పక్షాలన్నీ బాధ్యతాయుత పాత్రను పోషించి, సంక్షోభానికి సరైన పరిష్కారం లభించేలా చూడాలని జిన్‌పింగ్‌ అభిప్రాయపడ్డారు. దానిలో చైనా తమ వంతు పాత్రను పూర్తి చేస్తుందని తెలిపారు.  వాస్తవాలు, చారిత్రక సత్యాలను పరిగణనలో తీసుకుని ఉక్రెయిన్‌ విషయంలో మేం స్వతంత్ర వైఖరిని అనుసరిస్తున్నామన్నారు.  ప్రపంచ ఆర్థిక పురోగతి నిలకడగా ఉండేందుకు పాటుపడుతున్నాం అని అన్నారు. యుద్ద విరమణకు వీలుగా మధ్యవర్తిత్వం వహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా అనేది స్పష్టం కాలేదు.

Social Share Spread Message

Latest News