Skip to main content

Namaste NRI

కరణ్‌ అర్జున్‌ రిలీజ్‌కు రెడీ

అభిమన్యు, నిఖిల్‌ కుమార్‌, పిఫా ప్రధాన పాత్రధారులుగా మోహన్‌ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కరణ్‌ అర్జున్‌. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌లో ట్రైలర్‌ని విడుదల చేశారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ మహాభారతంలోని కర్ణుడు, అర్జునుడి భావోద్వేగాల స్ఫూర్తితో నేటి తరానికి తగ్గట్టుగా తెరకెక్కించిన చిత్రమిది. మూడు ప్రధాన పాత్రలతో రోడ్‌ థ్రిల్లర్‌గా సాగుతుంది కథ అన్నారు. నిర్మాతలు నాకు ఎంతో సపోర్ట్‌ చేశారు. ఖర్చుకు వెనకడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారన్నారు. బాలకృష్ణ ఆకుల మాట్లాడుతూ  మేము విడుదల చేసిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్సాన్స్‌ వచ్చింది. మా సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుందన్న నమ్మకం ఉంది అన్నారు.  ప్రేమ, యాక్షన్‌, మేళవింపుగా సాగే స్వచ్ఛమైన భావోద్వేగాలున్న చిత్రమిది అన్నారు కథానాయకులు నిఖిల్‌, అభిమన్యు. డా.సోమేశ్వరరావు పొన్నాల, బాలకృష్ణ ఆకుల, సురేష్‌, రామకృష్ణ, క్రాంతి కిరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ  నెల 24న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

………..

Social Share Spread Message

Latest News