అంతర్జాతీయ విమాన సర్వీసులకు చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై రెండేండ్లుగా నిషేదం విధించిన చైనా సర్వీసులను తిరిగి ప్రారంభిస్తున్నది. గత నెలలో భారత నిపుణులు, వారి కుటుంబ సభ్యులపై వీసా బ్యాన్‌ను చైనా ఎత్తివేసింది. భారతీయ విద్యార్థులను అనుమతించడం పైనా యోచిస్తున్నది. వేలాది మంది చైనా విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నారు. భారత్‌కు విమాన సర్వీసులను నడపడంపై స్పష్టత లేదు.














