నరేష్ అగస్త్య హీరోగా వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం శ్వేత అవస్తిని కథానాయికగా ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. విభిన్నమైన క్రైమ్ కామెడీ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. ఈ నెలలో రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుంది అని నిర్మాతలు తెలిపారు. మొదటి షెడ్యూల్లో శ్వేత జాయిన్ కానున్నారు. ఈ చిత్రంలో మరి కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. డెక్కన్ డ్రీమ్ వర్క్స్, జయదుర్గాదేవి మల్టీమీడియా బ్యానర్లపై నబీ షేక్, తూము నర్సింహా పటేల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరాలందిస్తున్నారు.














