Skip to main content

Namaste NRI

ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న కొండవీడు

శ్వేతా వర్మ, ప్రతాప్‌ రెడ్డి, శ్రీకృష్ణ,  నళినీకాంత్‌, నవీన్‌ రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా కొండవీడు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటి శ్వేత వర్మ మాట్లాడుతూ కథా బలమునన చిత్రమిది. కొవిడ్‌ టైమ్‌లో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. దర్శకుడు అద్బుతంగా తెరకెక్కించారు. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అంది. అనంతరం నిర్మాత ప్రతాప్‌ రెడ్డి మాట్లాడుతూ సినిమా సిద్ధంగా ఉన్నా కొవిడ్‌ వల్ల విడుదల చేయలేకపోయాం. ఫారెస్ట్‌ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమాకు అదే ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం అన్నారు. అడవి నేపథ్యంలో సాగే చిత్రమిది. సప్పెన్స్‌, థ్రిల్లింగ్‌ అంశాలుంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది అని దర్శకుడు అన్నారు. దసరాజు గంగాభవాని సమర్పణలో బీపీఆర్‌ సినిమా పతాకంపై ప్రతాప్‌ రెడ్డి నిర్మించారు. సిద్దార్థ శ్రీ దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది. ఈ కార్యక్రమంలో శ్వేతా శర్మ, ప్రతాప్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News