Skip to main content

Namaste NRI

పెద్దల సభకు ఆ నలుగురు… ప్రధాని మోదీ ప్రకటన

రాష్ట్రపతి ఎన్నికల వేళ రాజ్యసభ ఖాళీ సీట్లను భర్తీ చేసే ప్రక్రియ వేగం పెంచింది బీజేపీ. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ నలుగురు కూడా దక్షిణాదికి చెందిన వారే కావడం విశేషం. ఇళయరాజా (తమిళనాడు), విజయేంద్ర ప్రసాద్ (తెలుగు వ్యక్తి) పీటీ ఉష ( కేరళ), వీరేంద్ర హెగ్డే (కర్ణాటక)ను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. విజయేంద్ర ప్రసాద్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి. వీళ్ల నామినేట్ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్లో స్వయంగా ప్రకటించారు. ఆయా రంగాల్లో వాళ్ల గొప్పతనాన్ని తెలియజేస్తూ వాళ్లను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నందుకు గర్వంగా ఉందని ప్రధాని మోదీ తెలియజేశారు.

Social Share Spread Message

Latest News