Skip to main content

Namaste NRI

రామరావు  ట్రైలర్‌ వచ్చేది ఎప్పుడంటే ?

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా శరత్‌ మండవ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ రామారావు ఆన్‌ డ్యూటీ. రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలు. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటించారు. ఈ  నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈ నెల 16న ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అందులో రవితేజ బ్లాక్‌ టీ తాగుతూ కనిపించారు. 1995 నాటి నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్పీ, రవితేజ టీం వర్క్స బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా జులై 29న విడుదల కానుంది. దీనికి సామ్‌ సిఎస్‌ స్వరాలందిస్తున్నారు. సత్యన్‌ సూర్యన్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Social Share Spread Message

Latest News