Skip to main content

Namaste NRI

సారి చెప్పిన జిల్‌ బైడెన్‌… ఎందుకో తెలుసా?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ క్షమాపణలు చెప్పారు. లాటిన్‌ అమెరికా ప్రజలను టాకోలతో (చపాతీల్లాంటీ ఆహారం) పోల్చినందుకు క్షమాపణలు చెప్పారు. ఈ విషయాన్ని ఆమె అధికార ప్రతినిధి వెల్లడిరచారు. తన వ్యాఖ్యలపై జిల్‌ బైడెన్‌ క్షమాపణలు చెప్పారు అని అన్నారు. శాస్‌ ఆంటోనియో (టెక్సాస్‌) నగరలో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్‌ బైడెన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్సదమైన విషయం తెలిసిందే. లాటిన్‌ అమెరికా సంతతి ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న యూనిడోయూఎస్‌ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్‌ బైడెన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా లాటినో ప్రజలు వారసత్వ ఔన్నత్యాన్ని ప్రస్తావిస్తూ ఆమె లాటినోలు, టాకోలంత ప్రత్యేకమైన వారని కామెంట్‌ చేశారు. అయితే లాటినోల ప్రత్యేకతను ప్రశంసించాలన్న ఆమె ప్రయత్నం వికటించి విమర్శలకు దారి తీసింది.

Social Share Spread Message

Latest News