బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లాల్‌సింగ్ చద్దా. ఈ చిత్రంలో యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య బాలరాజు అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా నాగ చైతన్య ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. చిరునవ్వుతో ఆర్మీ దుస్తుల్లో చైతూ చాలా అందంగా కన్పిస్తున్నారు. కరీనాకపూర్, మోనాసింగ్ చిత్రంలో కనువిందు చేయనున్నారు. కాగా ఇటీవల ట్రైలర్‌ను అమీర్‌ఖాన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్, అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్టును సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. తెలుగులో గీతా ఫిల్మ్డిస్ట్రిబ్యూటర్స్ పంపిణీ చేయబోతోంది. ఈ ఏడాది ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.














