Namaste NRI

టీనేజ్‌ బ్యాక్‌డ్యాప్‌తో వస్తున్న ప్రేమించొద్దు

టీనేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ కథతో ఐదు బాషల్లో  విడుదల అవుతున్న మొదటి పాన్‌ ఇండియన్‌ ఇండిపెండెంట్‌ సినిమా ప్రేమించొద్దు. సిరిన్‌ శ్రీరామ్‌ కఫె బ్యానర్‌పై అనురూప్‌, దేవ మలిశెట్టి, సనాలి గర్జె, సారిక, మానస, యశ్వంత్‌ పెండ్యాల నటీ నటులుగా సిరిన్‌ శ్రీరామ్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతెన్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సంద్భంగా యూనిట్‌ హైదరాబాద్‌లో ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. గాయత్రి గుప్త మాట్లాడుతూ నాకు డైరెక్టర్‌ గత 10 ఏళ్లుగా తెలుసని, ఈ సినిమాకు పనిచేసిన వారందరూ నాకు స్నేహితులే అని అన్నారు. ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయటం ఆనందంగా ఉందన్నారు. ట్రైలర్‌ చాలా బాగుందన్నారు. కచ్చితంగా హిట్‌ అవుతుందన్నారు. హిందీలో ప్యార్‌ మత్‌ కర్నా, తమిళ్‌ లో కాదలి కాదే, కన్నడలో ప్రీతీసెబేడ, మలయాళంలో ప్రణయ కరత్‌ టైటిల్స్‌తో ఈ సినిమా విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో చిత్ర  దర్శకుడు సిరిస్‌ శ్రీరామ్‌, నటి సనాలి గర్జె, నటుడు దేనవమలిపెట్టి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events