Namaste NRI

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కోవిడ్‌ `19 సోకింది. ఆయనకు స్వల్పంగా కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఉన్నట్లు  వైట్‌ హౌస్‌ ప్రెసె సెక్రటరీ కరైన్‌ జీన్‌ పియర్రే తెలిపారు. ఆయన ఫ్పైజర్‌ ఇంక్‌కు చెందిన పాక్స్‌లోవిడ్‌ చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆయన వైట్‌ హౌస్‌లో ఐసొలేషన్‌లో ఉంటారని, అయితే తన విధులను కొనసాగిస్తారని చెప్పారు. వైట్‌ హౌస్‌ సిబ్బందితో టెలిఫోన్‌ ద్వారా మాట్లాడుతున్నారన్నారు. ఆయన పాల్గొనవలసిన సమావేశాల్లో తన నివాసం నుంచి  ఫోన్‌, జూమ్‌ ద్వారా పాల్గొంటారన్నారు.

                 జో బైడెన్‌ రెండు బూస్టర్‌ డోసులు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ఆయనకు స్వల్పంగా కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆయన పూర్తిగా కోలుకునే వరకు ఆయన ఆరోగ్య పరిస్థితిని రోజూ తెలియజేస్తామని వైట్‌హౌస్‌  ఓ   ప్రకటనలో పేర్కొంది. జో బైడెన్‌ సతీమణి జిల్‌కు కోవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందని తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events