శ్రీ ఆదిత్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ఆదిత్య టీ 20 లవ్‌స్టోరి. రమ్య, పవిత్ర, మాధురి కథానాయికలు. ఎంజే క్రియేషన్స్ బ్యానర్లో చిన్ని చరణ్ అడపా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ చాలా కొత్తగా ఉంది. నవతరం ప్రేమకథ ఇది. ఇంటిల్లిపాదికీ వినోదం పంచుతుంది. శ్రీ ఆదిత్య స్టైలిష్‌గా కనిపిస్తారు. కళ్లజోడు లుక్ కూడా కొత్తగా ఉంది.ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడ పూర్తయ్యాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు నిర్మాతలు. విజయ రంగరాజు, దత్తు, రాజనాల, అప్పారావు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: చినబాబు అడపా. ప్రభు తాళ్లూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.














