Namaste NRI

ఆస్ట్రేలియాలో ఘనంగా మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

ఆస్ట్రేలియాలో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్‌ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో కేటీఆర్‌ బర్త్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా సిడ్నీ, మెల్‌బోర్న్‌, కాన్‌బెర్రా, బ్రిస్బేన్‌, అడిలైడ్‌ పట్టణాలలో కూడా బర్త్‌డే వేడుకలను నిర్వహించారు. కాన్‌బెర్రాలో రవి సాయల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి ఘనంగా సంబరాలు చేశారు. ఈ సందర్భంగా రవి సాయల మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో కల్వకుంట్ల సాయికృష్ణ ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు.  ఈ వేడుకల్లో ఆస్ట్రేలియా కోర్‌ కమిటీ నాయకులు రaాన్సీ నోముల,  వీరేందర్‌, రమేష్‌ కైల రుద్ర కొట్టు, సిద్దు గొర్ల,  రాకేష్‌ లక్కరసు, గాయత్రి అరిగెల తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events