Namaste NRI

విశాల్‌ లాఠీ టీజర్‌ విడుదల

విశాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం లాఠీ.  సునయన కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. పోలీస్‌గా విశాల్‌ పాత్ర పవర్‌పుల్‌గా సాగింది. నీకే ఇంత పొగరున్నప్పుడు ఆ తప్పుని నిలదీసే పోలీసోడ్నీ నాకు ఎంత పొగరుంటుంది అంటూ విశాల్‌ హెచ్చరించడం పోలీస్‌ పవర్‌ను చూపించింది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఉత్కంఠను పంచుతూ సాగాయి. పోలీస్‌ కథాంశం నేపథ్యంలో విభిన్న చిత్రమిది. విశాల్‌ పాత్ర శక్తివంతంగా ఉంటుంది. ద్వితీయార్థంలో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది అని చిత్ర బృందం పేర్కొంది. ఏ.వినోద్‌కుమార్‌ దర్శకుడు. రానా ప్రొడక్షన్స్‌ పతాకంపై రమణ, నందా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోఫ్రీ: బాలసుబ్రమణ్యన్‌, సంగీతం: సామ్‌ సీఎస్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, దర్శకత్వం: ఏ.వినోద్‌. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం సెప్టెంబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events