Skip to main content

Namaste NRI

మాచర్ల నియోజకవర్గం నుంచి ధమ్కీ రిలీజ్‌

నితిన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. కృతీ శెట్టి, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ప్రముఖ ఎడిటర్‌ ఎమ్‌.ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మొదటి సారిగా నితిన్‌ పూర్తి స్థాయి మాస్‌ యాక్షన్‌ చిత్రంలో నటించారు.  ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేసాయి. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్‌ వరుసగా అప్‌డేట్‌లను ప్రకటిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటిని పెంచుతున్నారు. తాజాగా మేకర్స్‌  మాచర్ల ధమ్‌కీ అంటూ ఓ గ్లింప్స్‌ను విడుదల చేశారు. మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలాది మంది తమ సమాధులను పునాదులుగా వేశారు. మాచర్ల నియోజకవర్గంలో ధర్మాన్ని కాపాడటానికి నా సమాధిని పునాదిగా వెయ్యడానికి నేను సిద్ధం అంటూ నితిన్‌ చెప్పిన డైలాగ్‌ అకట్టుకుంది. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఆగస్టు 12న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం : మహతి స్వర సాగర్‌, కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ల.

Social Share Spread Message

Latest News