Skip to main content

Namaste NRI

గ్రే మ్యాన్‌ చిత్రానికి  సీక్వెల్‌

ప్రముఖ హాలీవుడ్‌ దర్శకులు రూసో బ్రదర్స్‌  తెరకెక్కించిన చిత్రం ది గ్రే మ్యాన్‌. ర్యాన్‌ గోస్లింగ్‌, క్రిస్‌ ఇవాన్స్‌, ధనుష్‌, ఆర్మాస్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇటీవల నెట్‌ఫిక్స్‌లో విడుదలైంది. ఇటీవల 92 దేశాల్లో విడుదలై అనూహ్య స్పందన  లభించిన ది గ్రే మాన్‌ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌ తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు రూసో బ్రదర్స్‌. ఈ విషయాన్ని వారే అధికారికంగా ప్రకటించారు.  ది గ్రే మాన్‌ కి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన అద్భుతం. ఆసక్తికరమైన పాత్రలున్న ఈ చిత్రాన్ని ప్రాంచైజ్‌లా కొనసాగించాలన్న ఆలోచన  మాకెప్పటి నుంచో ఉంది. త్వరలో తెరకెక్కనున్న సీక్వెల్‌లో మరో కొత్త  కోణం చూపించనున్నాం అని రూసో బ్రదర్స్‌ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల అంచనాలని అందుకున్నందుకు వారి అనూహ్య స్పందనకి చాలా సంతోషంగా ఉంది అన్నారు.

Social Share Spread Message

Latest News